Home > తెలంగాణ > కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. రేవంత్ రెడ్డితో భేటీ

కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. రేవంత్ రెడ్డితో భేటీ

కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. రేవంత్ రెడ్డితో భేటీ
X

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బీఆర్ఎస్కు గట్టి షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. ఇవాళ ఉదయమే

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కసిరెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశం తర్వాత బీఆర్ఎస్ కు రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్‌ ప్రకటించిన ఆరు గ్యారంటీల స్కీంతో పేదలకు మేలు జరుగుతుందని.. అందుకే హస్తం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు నారాయణ రెడ్డి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కసిరెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

2018 అసెంబ్లీ ఎన్నికల టైంలోనే కల్వకుర్తి నుంచి ఎన్నికల బరిలోకి దిగాలని కసిరెడ్డి భావించారు. అయితే అధిష్టానం ఆయనకు సర్ధిచెప్పి జైపాల్ యాదవ్‌కు టికెట్ ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో నారాయణ రెడ్డికి గులాబీ బాస్ ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఈ సారి కల్వకుర్తి నుంచి బీఆర్ఎస్ నుంచి పోటీ చేయాలని ప్రయత్నాలు చేసినా.. అధిష్టానం జైపాల్ యాదవ్ కే టికెట్ ఇవ్వగా.. అప్పటినుంచి కసిరెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. మరోవైపు నాగర్‌కర్నూల్‌ జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ బాలాజీ సింగ్‌ కూడా కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.

Updated : 1 Oct 2023 12:43 PM IST
Tags:    
Next Story
Share it
Top