Kavitha Liquor Scam : బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత కేసు విచారణ వాయిదా..
X
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టులో దాఖలు చేసిన కేసు విచారణ ఈ నెల 28కి వాయిదా పడింది. ఆమె కేసును ప్రత్యేకంగా విచారిస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. నళిని, చిదంబరం, అభిషేక్ బెనర్జీ పిటిన్లతో సంబంధం లేకుండా విచారిస్తామని పేర్కొంది. మహిళలను ఈడీ ఆఫీసుకు పిలిచి అధికారుల విచారించొచ్చ అనే కేసు పెండింగ్‌లో ఉండటంతో కవిత ఈడీ విచారణకు వెళ్లడం లేదు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ కవిత గతేడాది సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై శుక్రవారం జస్టిస్ బేలా ఎం.త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారణ జరిపింది. ఈ నెల 28న కేసు మొత్తం వింటామని ధర్మాసనం స్పష్టం చేసింది. కవిత తరపున సీనియర్ లాయర్ కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. కాగా తనను ఇంటి వద్దే విచారించాలని పిటిషన్ లో పేర్కొంది.
ఈడీ కార్యాలయానికి మహిళను విచారణకు పిలవడంపై ఆమె అభ్యంతరం తెలిపారు. సీఆర్పీసీ ప్రకారం ఆడవాళ్లను పిలిచి విచారించడం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కు విరుద్ధం అని పేర్కొన్నారు. అలాగే తనపై ఎలాంటి బలవంతపు చర్యలు ఈడీ తీసుకోకుండా ఆదేశాలివ్వాలని పిటిషన్ లో కోరారు. ఈ పిటిషన్ పై ఫిబ్రవరి 5వ విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఇరువర్గాల వాదనలు విన్నది. తదుపరి విచారణ ఫిబ్రవరి 16కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణలో పూర్తి స్థాయి వాదనలు జరగలేదు. దీంతో ఈనెల 28కి వాయిదా పడింది. ఢిల్లీ మద్యం విధానం కేసు దర్యాప్తులో భాగంగా గత ఏడాది మార్చిలో కవితను ఈడీ అధికారులు ఢిల్లీ కార్యాలయంలో మూడు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించారు. విచారణలో భాగంగా అధికారుల ఆదేశాల మేరకు గతంలో తాను ఉపయోగించిన సెల్‌ఫోన్లను కవిత అధికారులకు అప్పగించారు. ఈడీ కార్యాలయం వద్ద కాకుండా మహిళను ఇంటి వద్దే విచారించాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కవిత పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు రాకముందే ఈడీ అధికారులు గత సెప్టెంబరులో మరోసారి ఆమెకు నోటీసులు జారీ చేశారు. దీంతో నవంబరు వరకు కవితను విచారణకు పిలవరాదని కోర్టు ఆదేశించింది. ఇంతలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావడంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణ వెనక్కు వెళ్లింది.