Home > తెలంగాణ > Kavitha : ప్రధాని మోదీ పెద్దన్న ఎలా అవుతారో ముఖ్యమంత్రి చెప్పాలి.. కవిత కామెంట్స్

Kavitha : ప్రధాని మోదీ పెద్దన్న ఎలా అవుతారో ముఖ్యమంత్రి చెప్పాలి.. కవిత కామెంట్స్

Kavitha : ప్రధాని మోదీ పెద్దన్న ఎలా అవుతారో ముఖ్యమంత్రి చెప్పాలి.. కవిత కామెంట్స్
X

ఆదిలాబాద్ సభలో ప్రధాని మోదీని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పెద్దన్న అని సంబోధించడం మీద బీఆర్‌ఎస్ కవిత ఫైర్ అయ్యారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని ప్రధాని ఎలా పెద్దన్న అవుతాడాని సీఎం చెప్పాలని కవిత డిమాండ్ చేశారు.ముఖ్యమంత్రి మాటలతో బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అర్థమవుతుందని ఆమె అన్నారు. ఉద్యోగ రిజర్వేషన్లలో మహిళలకు జరుగుతున్న అన్యాయంపై ఈ నెల 8న నిరసన తెలుపుతామని ఆమె అన్నారు. గురుకుల నియామకాల్లో ఆడబిడ్డలకు అన్యాయం జరిగిందని ఆరోపించారు.

626 ఉద్యోగాల్లో కేవలం 12 శాతం 77 జాబ్‌లు వచ్చాయన్నారు. తక్షణమే జీవో నెం.3ను ముఖ్యమంత్రి రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి ఇస్తున్న ఉద్యోగాలన్ని మాజీ సీఎం కేసీఆర్ చేపట్టినవేనని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు. ప్రభుత్వం కొత్తగా జీవో నెంబర్ 3ని తీసుకు వచ్చిందని, దీనిని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ జీవోకు నిరసనగా ఈ నెల ఎనిమిదో తేదీ మహిళా దినోత్సవం రోజున ధర్నా చౌక్‌లో నల్ల రిబ్బన్లతో ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. మహిళలను, అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందన్నారు. రోస్టర్ విధానంతో మహిళలకు ఎక్కువమందికి ఉద్యోగాలు రాకపోయే ప్రమాదం ఉందన్నారు.




Updated : 4 March 2024 9:59 AM GMT
Tags:    
Next Story
Share it
Top