ఈడీ కస్టడీలో కవిత ఉపవాసం..మరోసారి చెల్లిని కలిసిన కేటీఆర్
X
ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. వారం రోజుల కస్టడీలో భాగంగా ఆమెను వివిధ కోణాల్లో అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేసుకు సంబంధించిన వివరాలను ఆమె దగ్గర నుంచి సేకరిస్తున్నారు. అయితే విచారణ పూర్తయిన తర్వాత ఆమె పుస్తకాలను చదువుతున్నట్లు సమాచారం. అయితే నిన్న ఏకాదశి కావడంతో ఉపవాసం చేసినట్లు తెలుస్తోంది. ఆమె కోరిక మేరకు అధికారులు పండ్లు తెప్పించి ఇచ్చారు. కవిత రోజూ ఉదయం గీతా పారాయణం, యోగా చేస్తున్నారని అధికారులు అన్నారు. ఆధ్యాత్మిక పుస్తకాలతో పాటు అంబేద్కర్, కరుణానిధి, రాం విలాస్ పాశ్వాన్ ఆటో బయోగ్రఫీ పుస్తకాలు తెప్పించుకుని చదువుతున్నారని చెప్పారు.
అయితే ఈడీ కస్టడీలో ఉన్న కవితను నాలుగో రోజు కూడా కేటీఆర్ కలిశారు. ఈడీ విచారణ తీరును అడిగి న్యాయపరంగా సహకరం అందిస్తున్నట్లు తెలిపి ధైర్యం చెప్పారు. కవిత ఇంట్లో సోదాల మేరకు సెక్యూరిటీ, వ్యక్తిగత సిబ్బందికి సంబంధించిన పదహారు ఫోన్లను ఈడీ స్వాధీనం చేసుకుంది. కవిత, ఆమె భర్త అనిల్, పీఆర్వో రాజేశ్, పీఏ శరత్ కుమార్, స్టాఫ్ రోహిత్ రావు ఫోన్లను పరిశీలించి తిరిగి వారికి ఇచ్చేశారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.