Home > తెలంగాణ > Kavitha : బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ రాజీ పడదు..కవిత

Kavitha : బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ రాజీ పడదు..కవిత

Kavitha : బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ రాజీ పడదు..కవిత
X

అసెంబ్లీలో కృష్ణా జలాల కోసం మాటల యుద్ధం కోనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వానికి కృష్ణ నదిపై ఉన్న ప్రాజెక్టులను అప్పగించబోమంటూ కాంగ్రెస్ అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించారు.

కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ అధికార పక్షం లేనిపోని ఆరోపణలు చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేసీఆర్ తెలంగాణ నీటి హక్కులను వదులుకునే మనిషి కాదన్న సంగతి ప్రజలందరికీ తెలుసని ధీమా వ్యక్తం చేశారు. జలాల సాధన కోసమే తెలంగాణ ఉద్యమం చేశామని గుర్తు చేశారు. కాబట్టి నీటి హక్కుల విషయంలో కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికీ రాజీ పడబోదని తేల్చి చెప్పింది.

కృష్ణానది పై ఉన్న ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించడానికి జరిగిన సమావేశాల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రాజెక్టులను తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని ఆరోపించారు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ తమపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని కవిత అన్నారు.




Updated : 12 Feb 2024 11:31 AM IST
Tags:    
Next Story
Share it
Top