Home > తెలంగాణ > కోర్టు ముందు కవిత కీలక వ్యాఖ్యలు..అక్రమంగా అరెస్ట్ చేశారు

కోర్టు ముందు కవిత కీలక వ్యాఖ్యలు..అక్రమంగా అరెస్ట్ చేశారు

కోర్టు ముందు కవిత కీలక వ్యాఖ్యలు..అక్రమంగా అరెస్ట్ చేశారు
X

ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరయ్యే ముందు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది అక్రమ అరెస్ట్ మేం కోర్టులో పోరాడుతాం అని చెబుతూ కోర్టులోకి ప్రవేశించారు. కాగా మరి కొద్ది సేపట్లో తీర్పు వెలువడనుంది.మరోవైపు, కోర్టులో కవిత తరపు న్యాయవాదులు, ఈడీ తరపు న్యాయవాదులు తమ వాదనలను వినిపిస్తున్నారు. లిక్కర్ స్కామ్ లో సౌత్ గ్రూప్ లో కవితను ప్రధాన వ్యక్తిగా ఈడీ పేర్కొంది. ఆమెను మరింతగా విచారించేందుకు కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరింది.

రిమాండ్ రిపోర్టును కూడా కోర్టుకు సమర్పించింది. ఈ నేపథ్యంలో కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే దానిపై టెన్షన్ నెలకొంది.తన అరెస్ట్ అక్రమం, అన్యాయం అని ఆరోపించారు. చట్టవిరుద్ధంగా తనను అరెస్ట్ చేశారని అన్నారు. అతి త్వరలో బయటకు వస్తానని.. ఎవరూ ఆందోళన చెందవద్దని తన అభిమానులకు సూచించారు. అక్రమ అరెస్టులపై న్యాయ పోరాటం చేస్తానని అన్నారు. కవిత అరెస్ట్‌ అంశంపై యూపీ మాజీ సీఎం, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ వేదికగా కవితకు మద్దతు ప్రకటించారు. ‘ఓటమి భయంతోనే ప్రతిపక్ష పారీలను బీజేపీ టార్గెట్ చేసింది. ఎంత పెద్ద మొత్తంలో ప్రతిపక్షాలపై దాడి చేస్తుందో.. అంతే పెద్ద మొత్తంలో ఆ పార్టీ ఓటమిని చవిచూస్తుంది.’ అంటూ ట్వీట్ చేశారు.

Updated : 16 March 2024 12:34 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top