Home > తెలంగాణ > Patnam Mahender Reddy : పట్నం మహేందర్ రెడ్డికి గనుల శాఖ

Patnam Mahender Reddy : పట్నం మహేందర్ రెడ్డికి గనుల శాఖ

Patnam Mahender Reddy : పట్నం మహేందర్ రెడ్డికి గనుల శాఖ
X

తెలంగాణ మంత్రివర్గంలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి సీఎం కేసీఆర్ శాఖను కేటాయించారు. రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖలను ఆయన అప్పగించారు. పట్నం గురువారం మధ్యాహ్నం మంత్రిగా ప్రమాణం చేశారు. రాజ్‌భవన్‌‌లో గవర్నర్ తమిళిసై ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ సహా పలువురు నేతలు హాజరయ్యారు. ఈటల రాజేందర్‌ను కేబినెట్ నుంచి తప్పించడంతో ఆయన స్థానం ఖాళీగా అయింది. తన దగ్గరున్న గనుల శాఖను కేసీఆర్ పట్నానికి అందించారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పట్నాన్ని బుజ్జగించడానికి కేబినెట్‌లోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

Updated : 24 Aug 2023 8:20 PM IST
Tags:    
Next Story
Share it
Top