కేసీఆర్తో అఖిలేష్ యాదవ్ భేటీ.. ప్రగతి భవన్లో లంచ్
X
సమాజ్ వాదీ పార్టీ చీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఇవాళ హైదరాబాద్ కు వస్తున్నారు. సీఎం కేసీఆర్ తో ప్రత్యేకంగా సమావేశం అయి.. ప్రగతి భవన్ లో లంచ్ చేయనున్నారు. జాతీయ రాజకీయాలపై వీళ్లిద్దరి మధ్య చర్చలు జరుగుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ వ్యతిరేక కూటమిలో భాగస్వామిగా ఉన్న అఖిలేష్ యాదవ్.. బీఆర్ఎస్ తో మంతనాలు జరపడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల పాట్నాలో జరిగిన విపక్షాల భేటీకి బీఆర్ఎస్ హాజరుకాని విషయం తెలిసిందే. అంతేకాకుండా.. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అంటూ రాహుల్ గాంధీ కామెంట్ చేసిన కొద్ది గంటల్లోనే అఖిలేష్ యాదవ్ తెలంగాణకు రావడంపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో వీరిద్దరి భేటీ ఆసక్తికరంగా మారింది. కాగా, గతంలో కూడా చాలాసార్లు వీళ్లిద్దరూ సమావేశమై దేశ రాజకీయాలపై చర్చించారు. అయితే, జులై 13,14 తేదీల్లో బెంగళూరుతో జరిగే సెకండ్ మీటింగ్ కు ముందు అఖిలేష్ కేసీఆర్ ను కలవడం వెనుకున్న మతలబ్ ఏంటనే క్లారిటీ రావాల్సి ఉంది.