బీఆర్ఎస్ 17 మంది లోక్సభ అభ్యర్థులు వీరే
X
తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో పార్టీలన్నీ తమ తమ అభ్యర్థులను ప్రకటించే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ పెండింగ్ లో ఉన్న హైదరాబాద్ లోక్ సభ స్థానాల అభ్యర్థులను ప్రకటించింది. గడ్డం శ్రీనివాస్ యాదవ్ ను బరిలోకి దించుతున్నట్లు ఆ పార్టీ అధినేత కేసీఆర్ చెప్పారు. ఈ మేరకు బీఆర్ఎస్ ఓ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే పలు విడతల్లో అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. హైదరాబాద్ స్థానాన్ని మాత్రం పెండింగ్ లో ఉంచింది. కాగా ఇవాళ శ్రీనివాస్ యాదవ్ ను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే 17 మంది అభ్యర్థుల వివరాలు ప్రకటించినట్లైంది.
బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే అభ్యర్థులు వీరే:
చేవెళ్ల – కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్
వరంగల్ – డాక్టర్ కడియం కావ్య
జహీరాబాద్ – గాలి అనిల్ కుమార్
నిజామాబాద్ – బాజిరెడ్డి గోవర్ధన్
కరీంనగర్ – బోయినపల్లి వినోద్ కుమార్
పెద్దపల్లి – కొప్పుల ఈశ్వర్
ఖమ్మం – నామా నాగేశ్వరరావు
మహబూబాబాద్ – మాలోత్ కవిత
మహబూబాబ్ నగర్ – మన్నె శ్రీనివాస్ రెడ్డి
మల్కాజిగిరి – రాగిడి లక్ష్మారెడ్డి
అదిలాబాద్ – ఆత్రం సక్కు
సికింద్రాబాద్ – పద్మారావుగౌడ్
భువనగిరి – క్యామ మల్లేశ్
నల్గొండ – కంచర్ల కృష్ణారెడ్డి
నాగర్ కర్నూల్ – ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మెదక్ – వెంకట్రామిరెడ్డి
హైదరాబాద్ – గడ్డ శ్రీనివాస్ యాదవ్
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.