Home > తెలంగాణ > 10 లక్షల మందితో సింహ గర్జన సభ ఏర్పాటు చేసి.. మేనిఫెస్టో విడుదల చేస్తాం: సీఎం కేసీఆర్

10 లక్షల మందితో సింహ గర్జన సభ ఏర్పాటు చేసి.. మేనిఫెస్టో విడుదల చేస్తాం: సీఎం కేసీఆర్

10 లక్షల మందితో సింహ గర్జన సభ ఏర్పాటు చేసి.. మేనిఫెస్టో విడుదల చేస్తాం: సీఎం కేసీఆర్
X

తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. సోమవారం (ఆగస్టు 21) తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో ఒకేసారి 115 మందితో కూడిన ఎమ్మెల్యే అభ్యర్థుల జంబో జాబితాను ప్రకటించారు. అందులో 95 నుంచి 105 స్థానాల్లో కచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, మజ్లిస్ కలిపి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో 29 స్థానాల్లో గెలుస్తామని తెలిపారు. మజ్లిస్, బీఆర్ఎస్ పార్టీల మధ్యున్న స్నేహపూర్వక వాతావరణం భవిష్యత్తులోనూ కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా మొత్తం 17 ఎంపీ స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

అక్టోబర్ 16న వరంగల్లో సింహ గర్జన సభ ఏర్పాటు చేసి.. మేనిఫెస్టోను విడుదల చేస్తామని తెలిపారు. అదేరోజున వరంగల్లో 10 లక్షల మందితో భారీ ర్యాలీ నిర్వహించి అన్ని వర్గాలను ఆకట్టుకునేలా తమ మేనిఫెస్టో విడుదల చేస్తామని వివరించారు. ఈ క్రమంలో అక్టోబర్ తొలి వారంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తారని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో మాట్లాడిన కేసీఆర్.. ఎమ్మెల్యే మైనంపల్లికి టికెట్ ఇచ్చామని, ఎలక్షన్స్ లో పోటీ చేయటం, చేయకపోవటం ఆయన ఇష్టమని అన్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలా? వద్దా? అని ఆయనే నిర్ణయించుకోవాలని తెలిపారు.




Updated : 21 Aug 2023 5:07 PM IST
Tags:    
Next Story
Share it
Top