Congress 6 Guarantees: కాంగ్రెస్ హామీలను కేసీఆర్ కాపీ కొట్టిండు - రేవంత్ రెడ్డి
X
బీఆర్ఎస్ మేనిఫెస్టోపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ హామీలను కాపీ కొట్టారే తప్ప అందులో ఏమీ లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మార్చిలోనే మేనిఫెస్టో ప్రకటించిందని ఇప్పుడు బీఆర్ఎస్ దాన్ని కాపీ కొట్టిందని ఆరోపించారు. తామిచ్చిన 6 గ్యారెంటీల అమలు అసాధ్యమన్న కేసీఆర్ ఇప్పుడు తానిచ్చిన హామీలు ఎలా అమలు చేస్తాడని రేవంత్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు చూసి కేసీఆర్కు చలిజ్వరం వచ్చిందని.. తాజాగా తమ పార్టీ అభ్యర్థుల్ని ప్రకటించడంతో ఆయనకు మరో భయం పట్టుకుందని రేవంత్ అన్నారు. కేసీఆర్ బుర్ర కరప్ట్ అయిందని, ఆయనకు ఆలోచించే సామర్థ్యం లేకుండా పోయిందని విమర్శించారు. సీఎం ఎక్స్పైరీ డేట్ అయిపోయిందని, అందుకే ఆయన ఎన్నికల బరి నుంచి తప్పుకొని ఫాంహౌస్లో విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ దెబ్బకొట్టేందుకు బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించవని రేవంత్ స్పష్టం చేశారు.
115 మంది అభ్యర్థుల్ని ప్రకటించి కేవలం 51 మందికి మాత్రమే బీ ఫాంలు ఇవ్వడం వెనుక మతలబేంటని రేవంత్ ప్రశ్నించారు. మిగతా వారికి బీఫాంలు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.
కాంగ్రెస్ను ప్రశ్నించే హక్కు కేసీఆర్ కు లేదన్న రేవంత్.. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచకుండా పోటీ చేసేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. అమరవీరుల స్థూపం వద్ద ఒట్టేస్తారా అని నిలదీశారు.