నందినగర్ నివాసానికి చేరుకున్న కేసీఆర్
X
హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. ఇవాళ (డిసెంబర్ 15) డిశ్చార్జ్ అయ్యారు. కేసీఆర్ గత గురువారం రాత్రి ఎర్రవల్లి లోని తన ఫామ్ హౌస్ లో కాలు జారి గాయపడిన సంగతి తెలిసిందే. ఆయన ఎడమ తుంటికి తీవ్ర గాయమవడంతో సోమాజిగూడలోని యశోద లో చేరారు. ఆస్పత్రి వైద్యులు ఆయనకు తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఆపరేషన్ నిర్వహించి తుంటి ఎముకకు స్టీల్ ప్లేట్లను అమర్చారు. ఆపరేషన్ సక్సెస్ అయి కోలుకున్న కేసీఆర్.. ఇవాళ డిశ్చార్జ్ అయ్యారు.
డిశ్చార్జ్ అనంతరం.. బంజారాహిల్స్ నందినగర్ లో ఉన్న ఆయన నివాసానికి వెళ్లారు. శస్త్రచికిత్స అనంతరం ఆస్పత్రిలో కోలుకుంటున్న కేసీఆర్‌ను.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సహా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పరామర్శించారు. కేసీఆర్ త్వరగా కోలుకుని, తిరిగి మామూలు స్థితికి రావాలని ప్రార్థించారు. డిశ్చార్జ్ అయిన సందర్భంలో.. పెద్ద ఎత్తున హాస్పిటల్ కు చేరుకున్న అభిమానులు ఆయనకు గుమ్మడి కాయ, నిమ్మకాయలతో దిష్టి తీశారు.