Home > తెలంగాణ > అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఫిక్స్.. అదే రోజు సీఎం పదవికి రాజీనామా..?

అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఫిక్స్.. అదే రోజు సీఎం పదవికి రాజీనామా..?

అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఫిక్స్.. అదే రోజు సీఎం పదవికి రాజీనామా..?
X

తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా. లేక హస్తం పార్టీ అదరగొడుతుందా అన్నది ఆసక్తిగా మారింది. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గుచూపాయి. దీంతో కాంగ్రెస్ అధికారంలో రావడం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఆదివారం నాడు తప్పని రుజువైతాయని బీఆర్ఎస్ చెబుతోంది. డిసెంబర్ 3న వచ్చే ఫలితాల్లో తమదే హవా అని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ క్రమంలో స్పందించిన సీఎం కేసీఆర్.. డిసెంబర్‌ 4న తెలంగాణ కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. మధ్యాహ్నం 2 గంటలకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ మేరకు తెలంగాణ సీఎంఓ ప్రకటన జారీ చేసింది.

కేబినెట్ భేటీ అనంతరం సీఎం కేసీఆర్ రాజ్భవన్ వెళ్లిలో గవర్నర్తో సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కేబీనెట్ మీటింగ్ దేనికదేది ప్రశ్నార్థకంగా మారింది. మరోసారి అధికారంలోకి వస్తామనే ధీమాతో ఉన్నారా? లేక ముందే ఓటమిని అంగీకరించి పదవి నుంచి తప్పుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే చర్య రాష్ట్ర రాజకీయాల్లో మొదలైంది. ఫలితాలు ఎలా ఉన్నా దానికి గులాబీ వర్గం సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. పోలింగ్ పూర్తైన తర్వాత వచ్చిన చాలా ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు అనకూలంగా రావడంతో బీఆర్ఎస్ పార్టీలో నిరాశం మొదలైందని, కాస్త ధైర్యం తెప్పించేందుకే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టినట్లు తెలుస్తుంది. రేపు ఉదయం 7 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైనా.. మధ్యాహ్నానికే ఎవరు గెలుస్తున్నారన్నది తెలుస్తుంది. అప్పటి వరకు ఎదురుచూడకుండా ముందే ఓటమిని అంగీకరించి మర్యదపూర్వకంగా పదవికి రాజీనామా చేసేందుకే మీటింగ్ పెట్టినట్లు తెలుస్తుంది.

రాజ్యాంగం ప్రకారం ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ప్రస్తుతం కొనసాగుతున్న అసెంబ్లీని రద్దుచేయడం తప్పనిసరి. ప్రస్తుత అసెంబ్లీ కాలపరిమితి జనవరి 16. ఈ లోగా కొత్తగా ఎన్నికైన సభ్యులు సభలో అడుగుపెట్టాలంటే.. ప్రస్తుత అసెంబ్లీ రద్దుకావాలి. రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీని రద్దు చేసే అధికారం కేబినెట్ కు మాత్రమే ఉన్నందున.. కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ నిర్వహించడం తప్పనిసరి. అందుకే కేసీఆర్ డిసెంబర్ 4న కేబీనెట్ మీటింగ్ పెట్టి, గవర్నర్ ను కలవనున్నారని తెలుస్తుంది. బీఆర్ఎస్ గెలిచినా, ఓడినా కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేయడం తప్పనిసరి. మళ్లీ గెలిస్తే గవర్నర్ ను కలిసి, పదవికి రాజీనామా చేసి, కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరే అవకాశం ఉంది.

Updated : 2 Dec 2023 8:41 AM IST
Tags:    
Next Story
Share it
Top