Home > తెలంగాణ > Yashoda Hospital:మాజీ సీఎం కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల

Yashoda Hospital:మాజీ సీఎం కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల

Yashoda Hospital:మాజీ సీఎం కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల
X

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ నిన్న రాత్రి తన ఫాంహౌస్‌ బాత్రూంలో జారిపడ్డారు. ఆయన కాలికి గాయం కావడంతో ఆర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఆయనను హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. కాగా, పలు మెడికల్ టెస్ట్‌ల అనంతరం యశోద ఆస్పత్రి వైద్యుల బృందం.. కేసీఆర్ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. కేసీఆర్ తుంటి ఎముకకు గాయమైందని యశోద డాక్టర్లు బులిటెన్ లో పేర్కొన్నారు. సిటి స్కాన్ లో ఎముక విరిగినట్లుగా గుర్తించామని, సర్జరీ అవసరం అవుతుందని సూచించారు. ఎడమ తుంటి ఎముకను రిప్లేస్ చేయనున్నట్లు తెలిపారు. దీంతో ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసీఆర్ కోలుకునేందుకు 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు.

ఇదిలా ఉండగా కేసీఆర్ కు అనుకోకుండా గాయమైనందున, ఆయన అనారోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించారు. యశోద ఆస్పత్రి వద్ద భద్రత పెంచాలని అధికారులను ఆదేశించారు. కేసీఆర్ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని వైద్యారోగ్య విభాగ అధికారులను ఆదేశించారు సీఎం ఆదేశాల మేరకు హాస్పిటల్ వద్ద సెక్యూరిటీ పెంచారు. ఇక కేసీఆర్ పడిపోయిన విషయం గురించి తెలియగానే కేసీఆర్ కుటుంబసభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలివెళ్లారు. కేటీఆర్, హరీశ్ రావు, కవిత ఆసుపత్రికి వెళ్లి వైద్యులతో చర్చించారు. కేసీఆర్‌ ఆరోగ్యంపై ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా స్పందించారు. కేసీఆర్‌కు స్వల్ప గాయమైందని, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. ఆయన త్వరలోనే కోలుకుంటారని వెల్లడించారు.

ఇదిలా ఉంటే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న కేసీఆర్ను పరామర్శించేందుకు పలువురు నేతలు యశోదకు క్యూ కట్టారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ఆరోగ్య సమాచారం తెలుసుకుంటున్నారు. వారంతా ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.


Updated : 8 Dec 2023 6:56 AM GMT
Tags:    
Next Story
Share it
Top