Home > తెలంగాణ > KCR : ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి రానున్న కేసీఆర్?

KCR : ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి రానున్న కేసీఆర్?

KCR : ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి రానున్న కేసీఆర్?
X

తెలంగాణ అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య వ్యూహాత్మక సమరానికి తెరలేవనుంది. నేటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. అయితే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వస్తారా? రారా? అనే ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్..గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలైంది. కాగా గత ఏడాది కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సెషన్ కి కేసీఆర్ దూరం అయ్యారు. ప్రమాదవశాత్తు తుంటి ఎముక విరగి సర్జరీ అవడంతో ఆయన రెండు నెలలుగా బయటికి రాలేదు. ఈ మధ్యే గాయం నుంచి కోలుకున్న గులాబీ దళపతి, గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అంతేగాక వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ కి క్యాంపెయినింగ్ కూడా చేయనున్నట్లు సమాచారం.

కొత్త పాత్రలో కేసీఆర్..

ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా, మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్ స్థానాలకు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఈ మారు కొత్త పాత్ర పోషించనున్నారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదాతో కేసీఆర్ అసెంబ్లీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అయితే ప్రమాదవశాత్తూ తుంటి విరగడంతో ఆపరేషన్ చేయించుకున్న కేసీఆర్..రెండు నెలలుగా అన్ని కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. అయితే గులాబీ శ్రేణులంతా కలిసి ఆయన్ని ప్రతిపక్ష నేతగా ఎన్నకున్న విషయం తెలిసిందే. అయితే ప్రతిపక్ష నేత పాత్ర పోషించనున్నారు. గత పదేండ్లు సీఎంగా అసెంబ్లీకి వచ్చిన ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో అధికార పార్టీకి ఎలాంటి సవాళ్లు విసురుతారు అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Updated : 8 Feb 2024 8:24 AM IST
Tags:    
Next Story
Share it
Top