Home > తెలంగాణ > KCR : నేడు అసెంబ్లీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

KCR : నేడు అసెంబ్లీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్

KCR : నేడు అసెంబ్లీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
X

మరికాసేపట్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. కేబినెట్ భేటీ అనంతరం బడ్జెట్ సమావేశం ప్రారంభం కానుంది. అయితే బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రతిపక్ష నేతగా తొలిసారి అసెంబ్లీకి రానున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వంలో తొలిసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ సమావేశాల్లో పాల్గొననున్నట్లు సమాచారం. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్..గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో ఓటమి పాలైంది. కాగా గత ఏడాది కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సెషన్ కి కేసీఆర్ దూరం అయ్యారు. ప్రమాదవశాత్తు తుంటి ఎముక విరగి సర్జరీ అవడంతో ఆయన రెండు నెలలుగా బయటికి రాలేదు. ఈ మధ్యే గాయం నుంచి కోలుకున్న గులాబీ దళపతి, గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. తర్వాత అసెంబ్లీ స్టార్ అయిన రోజున వస్తారని అంతా అనుకున్నారు కానీ ఆయన రాలేదు. కాగా అసెంబ్లీలో అధికార పార్టీ ప్రతిపక్ష నేత ఛాంబర్ మార్చడంపై బీఆర్ఎస్ శ్రేణులు అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

ప్రతిపక్షనేతగా తొలిసారి

ఎమ్మెల్యేగా, మంత్రిగా, డిప్యూటీ స్పీకర్ గా, మహబూబ్ నగర్, మెదక్, కరీంనగర్ స్థానాలకు ఎంపీగా, కేంద్ర మంత్రిగా, రెండు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ఈ మారు కొత్త పాత్ర పోషించనున్నారు. తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ అసెంబ్లీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గత పదేండ్లు సీఎంగా అసెంబ్లీకి వచ్చిన ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదాలో అధికార పార్టీకి ఎలాంటి సవాళ్లు విసురుతారో చూడాలి. అంతేగాక వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఆయన చురుగ్గా క్యాంపెయినింగ్ కూడా చేయనున్నట్లు సమాచారం.




Updated : 10 Feb 2024 4:54 AM GMT
Tags:    
Next Story
Share it
Top