Home > తెలంగాణ > BRS Manifesto: బీఆర్ఎస్ మేనిఫెస్టోతో.. ప్రతిపక్షాలు వణికిపోతున్నై: హరీష్ రావు

BRS Manifesto: బీఆర్ఎస్ మేనిఫెస్టోతో.. ప్రతిపక్షాలు వణికిపోతున్నై: హరీష్ రావు

BRS Manifesto: బీఆర్ఎస్ మేనిఫెస్టోతో.. ప్రతిపక్షాలు వణికిపోతున్నై: హరీష్ రావు
X

మరో 45 రోజుల్లో జరగబోయే తెలంగాణ అసెంబ్లో ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేశారు. అనంతరం హుస్నాబాద్ లో నిర్వహించిన సభ ద్వారా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టనున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి హరీష్ రావు.. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను హుస్నాబాద్ ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. సీఎం కేసీఆర్ కు హస్నాబాద్ అంటే అమితమైన ప్రేమ, నమ్మకం, గురి ఉన్నాయని అన్నారు. ఇక్కడి మట్టికున్న మహిమ కారణంగా గత ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించిందని చెప్పుకొచ్చారు. హుస్నాబాద్ ప్రజల దయతో బీఆర్ఎస్ పార్టీ రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా 100కు పైగా స్థానాల్లో గెలుపొందుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ బీఆర్ఎస్ మేనిఫెస్టోతో.. ప్రతిపక్షాలు వణికిపోతున్నాయన్నారు. ఒకప్పుడు కరువు పీడిత ప్రాతంగా ఉన్న హుస్నాబాద్ ను.. ఇవాళ పచ్చటి పొలాలతో బ్రహ్మాండంగా అభివృద్ది చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని తెలిపారు. ఎన్నికల వచ్చిన ప్రతీసారి హుస్నాబాద్ లో కొన్ని నినాదాలు, డిమాండ్ లు కనిపించేవని, వాటిని నెరవేర్చిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని చెప్పారు. హుస్నాబాద్ కు ప్రజలు ఎప్పుడూ.. గోదావరి నీళ్లు రావాలని, హుస్నాబాద్ ను రెవెన్యూ డివిజన్ చేయాలని, డీఎస్పీ ఆఫీస్ కావాలని, మున్సిపాలిటీగా మార్చాలని, అక్కన్నపేట మండలం కావాలని కోరుకునేవారు. వాటన్నింటినీ కేసీఆర్ ఆశిస్సులతో సతీష్ బాబు నిజం చేసి చూపించారని అన్నారు. ఇవాళ హుస్నాబాద్ నియోజక వర్గానికి కాళేశ్వరం నీళ్లు, దేవాదుల నీళ్లు, గౌరవెల్లి నీళ్లు తెచ్చి.. సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్ది. ప్రతీ ఇంటికి నల్లా నీళ్లు ఇచ్చి.. అక్కాచెల్లెల్ల మంచి నీటి గోస తీర్చిన వ్యక్తి కేసీఆర్. ఇక్కడి తండాలు గ్రామ పంచాయితీలుగా మారాలని ఎన్ని ప్రభుత్వాలను కోరినా పట్టించుకోలేదు. ఆ కలను నిజం చేసిన ఘనుడు కేసీఆర్ అని హరీష్ రావు చెప్పుకొచ్చారు.

Updated : 15 Oct 2023 5:39 PM IST
Tags:    
Next Story
Share it
Top