Home > తెలంగాణ > మైనార్టీ మహిళలకు అలర్ట్.. ఈరోజే లాస్ట్ డేట్

మైనార్టీ మహిళలకు అలర్ట్.. ఈరోజే లాస్ట్ డేట్

కేసీఆర్ కానుక.. కుట్టుమిషన్ల కోసం అప్లై చేసుకోండి

మైనార్టీ మహిళలకు అలర్ట్.. ఈరోజే లాస్ట్ డేట్
X



కేసీఆర్ ప్రభుత్వంలో.. రాష్ట్రంలోని అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. మహిళల కూడా ఆర్ధికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. అందులో భాగంగానే మైనార్టీ మహిళలకు కుట్టుమిషన్లు అందజేసేందుకు కేసీఆర్‌ కానుక అనే పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ పథకం దరఖాస్తులకు నేటితో(గురువారంతో) గడువు ముగియనున్నది. అత్యంత నిరుపేదలైన మైనార్టీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం 20 వేల కుట్టుమిషన్లను అందజేయనున్నది. వీటిలో క్రిస్టియన్‌ మైనార్టీ మహిళలకు 2 వేలు, ఇతర మైనార్టీ మహిళలకు 18 వేల కుట్టుమిషన్లను అందజేయనున్నట్టు మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ తెలిపింది.

ఈ పథకానికి 21-55 ఏళ్ల వయసు ఉండి, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు ఆదాయంతో తెల్లరేషన్‌ కార్డు కలిగిన నిరుపేద మైనార్టీ మహిళలు అర్హులు. ఆధార్‌కార్డు, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, విద్యార్హతల పత్రాలు, పాస్‌ ఫొటోలతో దరఖాస్తు చేసుకోవాలని ఆ శాఖ అధికారులు సూచించారు.


Updated : 20 July 2023 11:31 AM IST
Tags:    
Next Story
Share it
Top