Home > తెలంగాణ > స్పెషల్ సెషన్లో ఆ రెండు బిల్లులు ప్రవేశపెట్టండి.. ప్రధానికి సీఎం లేఖ..

స్పెషల్ సెషన్లో ఆ రెండు బిల్లులు ప్రవేశపెట్టండి.. ప్రధానికి సీఎం లేఖ..

స్పెషల్ సెషన్లో ఆ రెండు బిల్లులు ప్రవేశపెట్టండి.. ప్రధానికి సీఎం లేఖ..
X

సోమవారం నుంచి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఈ నెల 18 నుంచి 22 వరకు కొనసాగనున్న స్పెషల్ సెషన్ లో మహిళా బిల్లుతో పాటు బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని లేఖలో కోరారు. మహిళా, బీసీ రిజర్వేషన్ బిల్లులపై 2014లోనే తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. పార్లమెంటులో ఈ రెండు బిల్లులు ప్రవేశపెట్టాలంటూ ముఖ్యమంత్రి లేఖ రాయడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ నెల 18వ తేదీ నుండి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఇవాళ బీఆర్ఎస్ ఎంపీలతో భేటీ అయ్యారు. ప్రగతి భవన్‌లో బీఆర్ఎస్ లోక్ సభ, రాజ్యసభ ఎంపీలతో సమావేశమైన గులాబీ బాస్.. సభలో అనుసరించాల్సిన వైఖరిపై నేతలకు దిశానిర్దేశం చేశారు. జమిలీ ఎన్నికల బిల్లు, యూసీసీ బిల్లులు సభలో ప్రవేశపెడితే ఎలా వ్యవహరించాలన్న అంశంపై బీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ పలు సూచనలు చేసినట్లు సమాచారం. పార్లమెంట్ సాక్షిగా బీజేపీ వైఫల్యాలను ఎండగట్టడంపైనే నేతలకు మార్గదర్శనం చేసినట్లు తెలుస్తోంది.



telangana,Brs,cm kcr,letter,pm modi,women reservation bill,bc reservation bill,parliament special session,telangana assembly,brs parliamentary party meet,loksabha,rajya sabha,one nation one election,UCC bill,bjp

Updated : 15 Sep 2023 12:54 PM GMT
Tags:    
Next Story
Share it
Top