Home > తెలంగాణ > లాస్యనందిత అకాల మరణం ఎంతో బాధాకరం- KCR

లాస్యనందిత అకాల మరణం ఎంతో బాధాకరం- KCR

లాస్యనందిత అకాల మరణం ఎంతో బాధాకరం- KCR
X

రోడ్డు ప్రమాదంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యనందిత మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. అతి చిన్న వయసులో ఎమ్మెల్యేగా ప్రజామన్ననలు పొందిన లాస్య నందిత..ఇలా రోడ్డు ప్రమాదంలో అకాల మరణం చెందడం ఎంతో బాధాకరమని తీవ్ర విచారం వ్యక్తం చేశారు. కష్టకాలంలో వారి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా వుంటుందని భరోసా ఇచ్చారు. లాస్యనందిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

లాస్య నందిత మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంతాపం ప్రకటించారు. లాస్య నందిత మరణం తనను షాక్ కు గురి చేసిందని అన్నారు. గత వారమే లాస్య నందితను కలిసానని..ఇంతలో ఇలా ప్రమాదం జరగడం చాలా బాధాకరమని తనతో దిగిన ఫోటోలను ట్వీట్ చేశారు. ఒక యువ ఎమ్మెల్యేను, మంచి లీడర్ ను కొల్పోవడం చాలా దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు. కష్టకాలంలో లాస్య నందిత కుటుంబానికి ఆ దేవుడు తోడుగా ఉండాలని కేటీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Updated : 23 Feb 2024 8:39 AM IST
Tags:    
Next Story
Share it
Top