Home > తెలంగాణ > CM KCR: అధికారుల పెత్తనం పోయి.. రైతులు లక్షాదికారులు అయ్యారు: కేసీఆర్

CM KCR: అధికారుల పెత్తనం పోయి.. రైతులు లక్షాదికారులు అయ్యారు: కేసీఆర్

CM KCR: అధికారుల పెత్తనం పోయి.. రైతులు లక్షాదికారులు అయ్యారు: కేసీఆర్
X

తెలంగాణ ఏర్పడకముందు ఆలేరు నియోజకవర్గ పరిస్థితి దారుణంగా ఉండేదని.. కరువు ఏర్పడి సాగు, తాగు నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని దూరం చేసిందని ప్రజలకు గుర్తుచేశారు. ఎవరో చెప్పారని కాకుండా ఆలోచించి, విజక్షణతో ప్రజలు ఓటెయ్యాలని కేసీఆర్ కోరారు. ఎన్నికల్లో నాయకుల గెలుపు కాదు కావాల్సింది. ప్రజలు గెలుపు ముఖ్యమని అన్నారు. పార్టీ, నాయకుడి పేరు చూసి కాకుండా ప్రజలకు ఎవరు మంచి చేస్తారో చూసి ఓటెయ్యాలని ప్రజలను సూచించారు. యాదగిరి గుట్టను కళియుగ వైకుంఠ దామంలా తీర్చిదిద్దేందుకు కృషి చేసిన ఘనత గొంగిడి సునితకు దక్కుతుందని కేసీఆర్ అన్నారు. భువనగిరి, ఆలేర్ చుట్టుపక్కల ప్రాంతాల భూము రేట్లు పెరిగి, అక్కడి ప్రజలను కోటీశ్వరులు చేసింది బీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

కర్నాటక నుంచి వచ్చిన డీకే శివకుమార్.. అక్కడి ప్రభుత్వాన్ని చూసినేర్చుకోవాలంటున్నారు. అక్కడి ప్రభుత్వం రైతులకు 5 గంటల కరెంట్ ఇస్తుందని చెప్తున్నారు. 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రానికి వచ్చి తాము తాము రైతులకు 5 గంటల కరెంట్ ఇస్తున్నమని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో కూడా 24 గంటల కరెంట్ ఇవ్వట్లేదని, ఆ ఘనత బీఆర్ఎస్ పార్టీకి దక్కుతుందని కేసీఆర్ చెప్పారు. కేంద్రం ఎన్ని అడ్డంకులు పెట్టినా వాటిని నెరవేర్చిన పార్టీ బీఆర్ఎస్ అని గుర్తుచేశారు. కరువులో ఉన్న ఈ ప్రాంత భూములను మిషన్ కాకతీయతో సస్యశ్యామలంగా తీర్చిదిద్దాం. రైతుల అప్పుల బాధలు తీరాయి. అధికారుల పెత్తనం పోయి రైతులు లక్షాదికారులు అయ్యారు.

Updated : 29 Oct 2023 5:55 PM IST
Tags:    
Next Story
Share it
Top