Home > తెలంగాణ > Rajagopal Reddy : కేసీఆర్‌ రాజకీయాల నుంచి రిటైర్ కావాలి.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

Rajagopal Reddy : కేసీఆర్‌ రాజకీయాల నుంచి రిటైర్ కావాలి.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

Rajagopal Reddy : కేసీఆర్‌ రాజకీయాల నుంచి రిటైర్ కావాలి.. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
X

రాజకీయాలకు అతీతంగా అందరూ కేసీఆర్ నిర్వహించే సభను బహిష్కరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు కేసీఆర్ సంతకం చేశారని.. ఇప్పుడు కావాలనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు ఇంతకంటే ద్రోహం మరొకటి ఉంటుందా? అని ప్రశ్నించారు. దక్షిణ తెలంగాణను ఎడారిగా మార్చి.. ఇప్పుడు మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొట్టేందుకు కేసీఆర్.. నల్గొండలో సభ పెడుతున్నారన్నారు. కేసీఆర్ నల్గొండ సభను పార్టీలకు అతీతంగా ప్రజలంతా బహిష్కరించాలని రాజగోపాల్ రెడ్డి పిలుపునిచ్చారు.

నల్గొండ జిల్లా చండూరులో ఆదివారం మీడియాతో మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి.. నల్గొండ జిల్లాకు తీవ్ర అన్యాయం చేసింది మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డినే అన్నారు. 2014లో ముఖ్యమంత్రి హోదాలో ఎస్ఎల్బీసీ కుర్చీ వేసుకుని పూర్తిచేస్తానన్నారని , ఆ తర్వాత శివన్నగూడెం పూర్తి చేస్తా అన్నారని రాజగోపాల్ రెడ్డి గుర్తుచేశారు. ప్రాజెక్టులు పూర్తి చేయకుండా 10 సంవత్సరాల తర్వాత ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ నల్గొండకు వస్తున్నారో సమాధానం చెప్పాలని నిలదీశారు. ఇప్పటివరకు ఆయా ప్రాజెక్టుల కింద ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, భూనిర్వాసితులకు న్యాయం జరగలేదని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నుండి దిండి ఎత్తిపోతల పథకానికి ఎక్కడి నుంచి నీళ్లు తీసుకురావాలనే విషయంపై ఇప్పటికీ క్లారిటీ లేదని తెలిపారు. నార్లాపూర్ నుంచి తీసుకొస్తారా? వట్టెం నుండి తీసుకొస్తారా? ఇంతవరకు డిసైడ్ చేయలేదని చెప్పారు. కేసీఆర్ కు ఏమాత్రం విలువలు ఉన్నా.. రాజకీయాల నుంచి రిటైర్ కావాలన్నారు. జగన్‌తో స్నేహం చేసి కేఆర్ఎంబీపై సంతకం పెట్టి కేంద్రానికి అప్పజెప్పింది కేసీఆరేనని చెప్పారు. కాగా ఈ నెల 13న బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్.. చలో నల్లగొండ సభకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ సభను భారీ ఎత్తున నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారు. ఇందుకోసం భారీ జన సమీకరణ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.




Updated : 11 Feb 2024 2:02 PM GMT
Tags:    
Next Story
Share it
Top