ఆ రూట్లో పాతబస్తీకి మెట్రో.. పర్లేదు కొంచెం లేటైనా మంచి నిర్ణయం తీసుకున్నరు
X
పాతబస్తీ మెట్రో వాసుల ట్రాఫిక్ కష్టాలకు త్వరలో తెర పడనుంది. వాళ్ల కల సాకారం చేస్తూ.. మెట్రో రూట్ ను ప్రకటించింది. ఎంజీబీఎస్-ఫలక్ నుమా మార్గంలో 5.5 కిలోమీటర్ల మెట్రో రైలు నిర్మాణ పనులు చేపట్టాలని మున్సిపల్ శాఖ, ఎల్అండ్ టీ సంస్థకు సీఎం కేసీఆర్ సూచించారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్.. ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మెట్రో రైలు తొలివిడత ద్వారా 69.2 కిలోమీటర్లు నిర్మించిన ఎల్అండ్ టీ సంస్థ.. కొన్ని అభ్యంతరాల నేపథ్యంలో పాతబస్తీ రూట్ విషయంలో చేతులెత్తేసింది. రాయదుర్గ్ తోపాటు పలు ప్రాంతాల్లో 2.7 కిలోమీటర్లు అదనంగా నిర్మించడంతో పాటు.. నిలిచిపోయిన ఎంజీబీఎస్- ఫలక్‌నుమా మార్గాన్ని కూడా పూర్తి చేయనున్నారు. దీంతో హైదరాబాద్ లో మెట్రో రూట్ 74.7 కిలోమీటర్లు పూర్తవుతుంది. సంవత్సరాలుగా ఎంజీబీఎస్- ఫలక్‌నుమా వరకు 5.5 కిలోమీటర్ల మెట్రో మార్గం నిలిచిపోయింది. ఆ రూట్ లో పెద్ద సంఖ్యలో ప్రార్థన మందిరాలు తొలగించాల్సి రావడంతో.. మజ్లీస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది.