Home > తెలంగాణ > 26న కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ

26న కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ

26న కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ
X

ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మోదీ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వచ్చాక ఇవే చివరి పార్లమెంట్ సమావేశాలు. ఈ సమావేశాల్లో కేంద్రం మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఈ క్రమంలో ఈనెల 26 కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశమవుతోంది. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.

మరోవైపు పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలను ఎంపీ ఎన్నికల్లో రిపీట్ కాకుండా చూడాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్షలు నిర్వహించారు. ఎన్నికల సన్నద్ధత, గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

Updated : 25 Jan 2024 12:06 PM IST
Tags:    
Next Story
Share it
Top