త్వరలో ఢిల్లీకి మాజీ సీఎం కేసీఆర్.. రాజకీయాల్లో హాట్ టాపిక్
X
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారిగా మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లున్నారు. లోక్ సభ ఎన్నికల ముందు కేసీఆర్ ఢిల్లీ పర్యటన రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బీజేపీతో బీఆర్‌ఎస్ పొత్తు ఉండొచ్చంటూ అనే ప్రచారం జరుగుతున్న వేళ కేసీఆర్ పర్యటన ఉత్కంఠ నెలకొంది.ఈ ఊహాగానాలను బీజేపీ నేతలు మాత్రం కొట్టిపారేస్తున్నారు. తుంటి ఆపరేషన్ తరువాత కేసీఆర్ కూడా లైన్‌లోకి వచ్చేశారు. నల్లగొండ సభ సూపర్ సక్సెస్ అయిందనే ఉత్సాహంతో ఉంది ఆ పార్టీ. ఓవైపు కేటీఆర్, హరీష్‌రావు నియోజకవర్గాలను చుట్టేస్తున్న వేళ, అసెంబ్లీలో ఈ ఇద్దరూ ప్రభుత్వానికి ధీటుగా సమాధానాలు చెబుతున్న వేళ.. కేసీఆర్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ముఖ్యంగా లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చే వ్యూహాన్ని అనుసరిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ బాపు అంటూ కేసీఆర్‌ను ఫోకస్ చేస్తున్నారంటూ ఓ ఉదాహరణ చూపిస్తున్నారు.
మొన్న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ బాపు అనే స్లోగన్ ఒకటి హైలెట్ అయింది. ఢిల్లీలో కెసిఆర్ రాజకీయ చర్చల కోసం వస్తున్నారన్న వార్తలను మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఖండించారు. అసలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పొత్తుల గురించి ఎవరు మాట్లాడారని ప్రశ్నించారు. "మేము కిషన్ రెడ్డి తో ఏమైనా ఎప్పుడైనా పొత్తుల గురించి ఊసెత్తమా? బండి సంజయ్ లక్ష్మణ్ కిషన్ రెడ్డి ఎందుకు ఎగిరి పడుతున్నారు? బీఆర్‌ఎస్ ఒక సెక్యులర్ పార్టీ, మా నాయకుడు కెసిఆర్ ఒక సెక్యులర్ నాయకుడు. ఇలాంటి వార్తలకు లీకులు ఇచ్చేది బీజేపీనే. అలాగే వార్తలు రాయించేది బీజేపీ." అన్నారు బాల్క సుమన్. బీజేపీతో బీఆర్‌ఎస్‌కు పొత్తు ఉండే అవకాశం ఉందని మాజీ మంత్రి మల్లారెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌కు మల్కాజ్ గిరి సీటు ఇస్తారని ఆయన అన్నారు. బీజేపీతో బీఆర్‌ఎస్ పొత్తు ఉండే అవకాశమున్నప్పుడు.. మా ఎమ్మెల్యేలు టచ్ లో వున్నారని బండి సంజయ్ ఎలా మాట్లాడతారు? బండి సంజయ్‌తో అయ్యేది లేదు..పొయ్యేది లేదు" అన్నా విషయం తెలిసిందే.