Home > తెలంగాణ > KCR : నేడు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం

KCR : నేడు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం

KCR : నేడు ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం
X

నేడు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీకి కేసీఆర్‌ చేరుకోనున్నారు. 12.45 నిమిషాలకు అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేస్తారని బీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం ఆయన ఛాంబర్ లో ప్రత్యేక పూజలు చేసి, ప్రతిపక్ష నేతగా బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ సందర్భంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో గజ్వేల్‌ నియోజకవర్గం నుంచి మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రమాదవశాత్తు తుంటి ఎముకకు గాయం కావడం, సర్జరీ జరగడం తదితర కారణాలతో కేసీఆర్‌ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేదు.




Updated : 1 Feb 2024 7:01 AM IST
Tags:    
Next Story
Share it
Top