Home > తెలంగాణ > KCR : రేపు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం

KCR : రేపు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం

KCR : రేపు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం
X

బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్ రేపు గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ ఆయన ఆహ్వానించారు. రేపు స్పీకర్ సమక్షంలో ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తారు. తన ఫామ్‌ హౌస్ లో కింద పడడంతో తుంటి ఎముక విరిగి ఆసుపత్రిలో ఉన్నారు. తుంటి ఎముక సర్జరీ అనంతరం రేపు గులాబీ బాస్ బయటికి రానున్నారు. అయితే ఆయన అసెంబ్లీకి వీల్ చైర్లో వస్తారన్న వార్త పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు చక్కర్లు కొడుతోంది. సార్వత్రిక ఎన్నికల వస్తున్న నేపథ్యంలో..కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్ అవ్వక తప్పదు. ఈ తప్పని సరి పరిస్థితుల్లో ఆయన వీల్ చైర్లో అయినా ప్రజల ముందుకు రావాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.





సరే ఒక రాజకీయనాయకుడిగా, ప్రతిపక్ష నేతగా ఆయన ప్రజలలోకి రావడం పెద్ద విశేషమేమీ కాదు. అయితే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చవిచూసిన తర్వాత కేసీఆర్ ఇప్పటివరకు మాట్లాడలేదు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఎవరికీ చెప్పాపెట్టకుండా..సీక్రెట్ గా ప్రగతి భవన్ ను ఖాళీ చేసి ఫామ్ హౌస్ కు వెళ్లిపోయారు. కనీసం ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీకి అభినందనలు కూడా చెప్పలేదు. ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేసి ఆ లేటర్ ను గవర్నర్ క ఓస్డీ ద్వారా పంపించారు. అటు తొమ్మిదేండ్ల పాటు అధికారం ఇచ్చిన ప్రజలకు ధన్యావాదాలు తెలుపలేదు. ఇటు హుందాగా బీఆర్ఎస్ ఓటమిని ఒప్పుకోలేదు. అయితే సార్వత్రిక ఎన్నికలు వచ్చే సరికి మళ్లీ జనం ముందుకు ఎలా వస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల ప్రచారం కూడా వీల్ చైర్ లోనే చేస్తారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అలా అయితేనే సెంటిమెంట్, సానుభూతి వెల్లువెత్తి పార్టీకి లబ్ధి చేకూరుతుందన్నది ఆయన వ్యూహంగా రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు.




Updated : 31 Jan 2024 3:52 AM GMT
Tags:    
Next Story
Share it
Top