Home > తెలంగాణ > Cabinet Meeting : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ పేర్లను కేబినెట్ తీర్మానం

Cabinet Meeting : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ పేర్లను కేబినెట్ తీర్మానం

Cabinet Meeting : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ పేర్లను కేబినెట్ తీర్మానం
X

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను ఖరారు చేస్తూ నేటి కేబినేట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. గతంలోనే వీరి పేర్లను ఖరారు చేయగా హైకోర్టు ఆదేశాలతో మరోసారి కేబినేట్ తీర్మానించింది. దీంతో మరోసారి రాష్ట్ర సర్కార్ ఈ రెండు పేర్లును గవర్నర్‌కు పంపనుంది .మహిళలకు నెలకు 2500 రూపాయలపై ఇవాళ కేబినెట్ నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.లోకసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ దిశా నిర్దేశం చేయనున్నారు. అలాగే రైతు భరోసా, రైతు రుణమాఫీపై కూడా కేబినెట్ చర్చించనుంది. రానున్న అవసరాలకు సాగు, తాగు నీటిపై కూడా చర్చించే ఛాన్స్ ఉంది.

ధరణిపై కేబినెట్లో చర్చకు రానుంది. సిట్ విచారణ జరిపించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. బీసీలోని కొన్ని కులాలకు ప్రత్యేక కార్పొరేషన్ల ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వడ్డీలేని రుణ పథకాన్ని తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో అందుకు అవసరమైన నిధుల కేటాయింపు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని పది మండలాలకు సాగు, తాగునీరు అందించేందుకు నిర్మించనున్న నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఆమోదం, మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటు ఘటనపై జ్యుడీషియల్ విచారణకు ఆమోదించడం, రైతు భరోసా పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేయడానికి అవసరమైన మార్పుచేర్పులు, వర్షాకాలం నుంచి పంటల బీమా అమలు వంటి అంశాలపై నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. నాలుగున్నర గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో ప్రభుత్వం భారీ మహిళా సదస్సు నిర్వహిస్తోంది. ఇందులో మహిళలకు జీరో వడ్డీ, స్వయం సహాయక సంఘాలకు బీమా కల్పన వంటి వాటిపై ప్రకటన చేసే అవకాశం ఉంది.




Updated : 12 March 2024 11:42 AM GMT
Tags:    
Next Story
Share it
Top