Revanth Reddy : తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం..అన్ని శాఖల్లో డిప్యుటేషన్ల రద్దు !
X
ప్రభుత్వ శాఖల్లో డిప్యుటేషన్ల దిశగా రేవంత్ సర్కారు కసరత్తు చేస్తోంది. విపత్తుల వంటి అత్యవసర సమయల్లో తప్ప మిగతా రోజుల్లో డిప్యుటేషన్ల అనుమతించరాదని ఏ శాఖ అధికారులు ఆ డిపార్ట్మెంట్‌లోనే విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేయనుంది. ఇప్పటికే అన్ని శాఖల్లోని డిప్యుటేషన్ల వివరాలు ఇవ్వాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. రవాణా తదితర శాఖల్లో అదనపు విధులు-బాధ్యతల విధానాన్ని రద్దు చేసినట్లుగానే అన్ని శాఖల్లో డిప్యుటేషన్ల రద్దుపై ఈ నెలలోనే ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో వేయి మందికి పైగా అధికారులు అయిదేళ్లకు మించి డిప్యుటేషన్‌లో కొనసాగుతున్నారని ఉన్నతాధికారులు తెలిపార. ప్రస్తుతం అన్ని శాఖల్లో కలిపి 4 వేల మంది అధికారులు, 14 వేల మందికి పైగా ఉద్యోగులు డిప్యుటేషన్లపై ఉండగా.. హైదరాబాద్ కేంద్రంగానే దాదాపు 8 వేల మంది వివిధ హోదాల్లో ఇలా పనిచేస్తున్నారు. అన్నింటికంటే ఎక్కువగా విద్యాశాఖ నుంచి ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇతర శాఖల్లో డిప్యుటేషన్‌పై పనిచేస్తున్నట్లు సమాచారం.