Home > తెలంగాణ > KRMBకి ఆ ప్రాజెక్టులు.. ముగిసిన కృష్ణా బోర్డు సమావేశం

KRMBకి ఆ ప్రాజెక్టులు.. ముగిసిన కృష్ణా బోర్డు సమావేశం

KRMBకి ఆ ప్రాజెక్టులు.. ముగిసిన కృష్ణా బోర్డు సమావేశం
X

కృష్ణా ప్రాజెక్టుల విషయంలో తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. హైదరాబాద్లో ఇవాళ కృష్ణా రివర్బోర్డు మేనేజ్మెంట్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్కు తెలంగాణ, ఏపీ ఇంజినీర్ ఇన్ చీఫ్లు హాజరయ్యారు. నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వహణను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు ఇరు రాష్ట్రాల ఈఎన్సీలు అంగీకరించారు. ఏపీలో 9, తెలంగాణలో 6 కంపోనెంట్స్ అప్పగింతకు నిర్ణయం జరిగినట్లు వారు తెలిపారు.

కృష్ణా జలాల్లో 50శాతం వాటకు కట్టుబడి ఉన్నామని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ రావు స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏవైన ఇబ్బందులు ఉంటే ఢిల్లీ వేదికగా చర్చిస్తామన్నారు. జల విద్యుత్ ఉత్పత్తిపై చర్చ జరగలేదన్నారు. నీటి విడుదల అంశాన్ని కమిటీకి అప్పగించామన్నారు. నీటి వాటాల కేటాయింపుపై త్రిసభ్య కమిటీదే తుది నిర్ణయమని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి వివరించారు. సిబ్బంది కేటాయింపుకు ఇరు రాష్ట్రాలు ఒప్పుకున్నట్లు చెప్పారు.

Updated : 1 Feb 2024 10:09 AM GMT
Tags:    
Next Story
Share it
Top