Home > తెలంగాణ > ఎమ్మెల్యే లాస్య రోడ్డు ప్రమాదంలో కీలక ఆధారాలు

ఎమ్మెల్యే లాస్య రోడ్డు ప్రమాదంలో కీలక ఆధారాలు

ఎమ్మెల్యే లాస్య రోడ్డు ప్రమాదంలో కీలక ఆధారాలు
X

సికింద్రాబాద్ కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత కారు ప్రమాదం కేసు కీలక మలుపు తిరిగింది. ఎమ్మెల్యే కారు ఢీకొట్టిన టిప్పర్‌ను పోలీసులు గుర్తించారు.టిప్పర్‌ను పోలీసులు గుర్తించారు. లారీ డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే మరణించగా,పీఏ ఆకాశ్‌కు గాయాలు అయ్యాయి. ఆకాశ్ నిద్రమత్తలో కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు.ఫిబ్రవరి 23న పటాన్‌చెరు పరిధిలోని ఎల్లంకి ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలోని రింగ్‌రోడ్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో లాస్య నందిత (37) దుర్మరణం చెందారు. లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు.. గుర్తుతెలియని వాహనాన్ని వెనక నుంచి ఢీకొని అదుపు తప్పి రోడ్డుకు ఎడమవైపు దూసుకెళ్లి రెయిలింగ్‌ను బలంగా ఢీకొంది.

ప్రమాదం తీవ్రతకు వాహనం ముందువైపు ఎడమ భాగం నుజ్జునుజ్జయింది. కారు నడుపుతున్న ఆమె పీఏ ఆకాశ్‌ తీవ్రంగా గాయపడ్డారు. రెండు కాళ్లూ విరిగిపోవడంతో ఆయన కారులోనే ఇరుక్కుపోయారు. డ్రైవర్‌ పక్క సీట్లో కూర్చున్న నందిత సీటు బెల్ట్‌ పెట్టుకున్నా, ఎయిర్‌బ్యాగ్‌లు తెరుచుకున్నా.. ఆమె తలకు, ముఖానికి, కాళ్లకు తీవ్రగాయాలై అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అయితే లాస్య తండ్రి మాజీ ఎమ్మెల్యే జి.సాయన్న గత ఏడాది ఫిబ్రవరి 19న అనారోగ్యంతో మరణించారు. ఆయన ప్రథమ వర్థంతి జరిగి నాలుగు రోజులు గడవక ముందే కుమార్తె రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రోడ్డు ప్రమాదంపై పోలీసులు ముమ్ముర దర్యాప్తు చేపట్టారు. మరిన్ని కీలక ఆధారాలు లభించినట్లు తెలుస్తోంది.

Updated : 1 March 2024 11:50 AM IST
Tags:    
Next Story
Share it
Top