మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కస్టడీలో సంచలన విషయాలు
X
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు కస్టడీలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓ మీడియా సంస్థ యాజమాని ఇచ్చిన నెంబర్లను కూడా ప్రణీత్ ఫోన్ ట్యాప్ చేసినట్లు కనుగొన్నారు. ఏకంగా ఓ సర్వర్‌ను ఆయన వద్ద పెట్టాడు. వరంగల్, సిరిసిల్లలోనూ సర్వర్లు ఏర్పాటు చేయించి ట్యాప్ చేశాడని గుర్తించారు. బీఆర్‌ఎస్ కీలక నేత ఆదేశాల మేరకు వీటిని ఏర్పాటు చేసినట్లు అధికారులు నిర్థారణకు వచ్చారు.
ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ పై ఎర్రబెల్లి స్పందిస్తూ... ఆయన ఎవరో కూడా తనకు తెలియదని అన్నారు. ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు చెప్పాలని ప్రణీత్ రావుపై అధికారులు ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ వంద రోజుల పాలన ఫ్లాప్ అయిందని అన్నారు. ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని చెప్పారు. మోసాలు చేయడం, మాయ మాటలు చెప్పడం ముఖ్యమంత్రి రేవంత్ కు అలవాటేనని అన్నారు.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.