Home > తెలంగాణ > Khairatabad Ganesh: మొదలైన ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర

Khairatabad Ganesh: మొదలైన ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర

Khairatabad Ganesh: మొదలైన ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర
X

హైదరాబాద్ లో నేడు గణేష్ ఉత్సవాల శోభ మొదలయింది. ఆధ్యాత్మికత ఒకవైపు, వాహ్.. అనిపించే సంబరాలు మరోవైపు. నగరమంతా నిమజ్జన వేడుక జరుపుకుటుంది. వస్తా వెళ్లొస్తానంటూ (Khairatabad Ganesh) ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనానికి బయలెళ్లినాడు. దేశంలో ప్రత్యేకమైన ఈ వినాయకుడిని చివరిసారి దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చారు. దీంతో సాగర తీరం సందడిగా మారింది. ఖైరతాబాద్‌ మహాగణపతి శోభాయాత్ర.. వైభవంగా మొదలయింది. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర..ట్యాంక్ బండ్ వైపు సాగుతుంది. నగరం నలుమూలల నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. జయ, జయ ధ్వానాల మధ్య.. బొజ్జ గణపయ్య యాత్ర జరుగుతోంది. మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్యలో హుస్సేన్‌సాగర్‌లో మహాగణపతి నిమజ్జనం పూర్తికానుంది. గణపతి బప్పా మోరియా.. అంటూ భక్తులు నినాదాలు చేస్తూ గణనాథునికి వీడ్కోలు పలుకుతున్నారు. వేడుకల కోసం పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. అదనపు బలగాలను రప్పించి భద్రత కల్పిస్తున్నారు.




Updated : 28 Sept 2023 8:10 AM IST
Tags:    
Next Story
Share it
Top