Home > తెలంగాణ > RTA Khairthabad: ఫ్యాన్సీ నంబర్లతో ఖైరతాబాద్ ఆర్టీఏకు మస్త్ పైసల్.. ఏ నంబర్కు ఎంతంటే..?

RTA Khairthabad: ఫ్యాన్సీ నంబర్లతో ఖైరతాబాద్ ఆర్టీఏకు మస్త్ పైసల్.. ఏ నంబర్కు ఎంతంటే..?

RTA Khairthabad: ఫ్యాన్సీ నంబర్లతో ఖైరతాబాద్ ఆర్టీఏకు మస్త్ పైసల్.. ఏ నంబర్కు ఎంతంటే..?
X

కొందరు వాహనదారులకు లక్కీ నంబర్, ఫ్యాన్సీ నంబర్ సెంటిమెంట్ ఉంటుంది. కావాల్సిన నంబర్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. ఎంత పోటీనైనా ఎదుర్కొంటారు. అటు రవాణా శాఖ కూడా దీనిని క్యాష్ చేసుకుంటుంది. ఫ్యాన్సీ నంబర్లు వేలం వేస్తూ భారీ ఆదాయాన్ని రాబట్టుకుంటోంది. ఖైరతాబాద్ ఆర్టీఏకు ఒక్కరోజులోనే భారీ ఆదాయం వచ్చింది. సుమారు రూ.41,86,370ల ఆదాయం వచ్చింది.

ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయంలో ఫ్యాన్సీ నంబర్ల వేలం జరిగింది. టీఎస్‌ 09 జీడీ 9999 నెంబర్కు ఓ సంస్థ రూ.15,53,000 ఖర్చు చేసింది. ఈ నంబర్ను ముప్పాల హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సొంతం చేసుకుంది. ఆ తర్వాత TS 09 GE 0009 నంబర్ను గీతా ఆటోమోటీవ్ ఎల్‌ఎల్‌పీ రూ.3,29,999 కు కొనుగోలు చేసింది. TS 09 GE 0001ను గారపాటి శ్రీనివాస్ బాబు రూ.3,06,000కు కైవసం చేసుకుంది.

TS 09 GE 0005 నంబర్ శ్రీలక్ష్మి గణపతి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ - రూ.2,10,000.

TS 09 GE 0019 నంబర్ నాగవంశీ సూర్యదేవర - రూ.2,03,000.

TS 09 GE 0006 నంబర్ కల్పన కొండ్రాజు - రూ.1,90,000.

TS 09 GE 0007 నంబర్ వాసవి ఎవెన్యూస్ ఎల్‌ఎల్‌పీ - రూ.1,61,116.

TS 09 GE 0023 నంబర్ స్టోన్ క్రాప్ట్ ప్రాపర్టీస్ ఎల్ఎల్‌పీ - రూ.1,56,116.

TS 09 GE 0027 నంబర్ న్యూలాండ్ లేబోరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ - రూ.1,27,000

Updated : 12 Oct 2023 11:04 PM IST
Tags:    
Next Story
Share it
Top