Home > తెలంగాణ > బీఆర్ఎస్లో చేరిన ఖమ్మం జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేతలు

బీఆర్ఎస్లో చేరిన ఖమ్మం జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేతలు

బీఆర్ఎస్లో చేరిన ఖమ్మం జిల్లా సీనియర్ కాంగ్రెస్ నేతలు
X

ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన పలువురు కాంగ్రెస్‌ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో వారు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ను కలిసి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ మంత్రి, పీసీసీ ఉపాధ్యక్షుడు సంభాని చంద్రశేఖర్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఎడవల్లి కృష్ణ, విద్యార్థి నేత, పీసీసీ ప్రధాన కార్యదర్శి కోటూరి మానవతా రాయ్‌, వెంకట్‌గౌడ్‌, సీనియర్ నేత అబ్బయ్య దంపతులు, రామచంద్రు నాయక్‌ తదితరులకు కేసీఆర్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నెల 13న దమ్మపేటలో జరగనున్న కేసీఆర్ సభలో.. మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు బీఆర్ఎస్లో చేరనున్నట్లు సమాచారం.


Updated : 10 Nov 2023 8:23 PM IST
Tags:    
Next Story
Share it
Top