Home > తెలంగాణ > MLA Rekha Nayak : బీఆర్ఎస్కు ఖానాపూర్ ఎమ్మెల్యే రాజీనామా..

MLA Rekha Nayak : బీఆర్ఎస్కు ఖానాపూర్ ఎమ్మెల్యే రాజీనామా..

MLA Rekha Nayak   : బీఆర్ఎస్కు ఖానాపూర్ ఎమ్మెల్యే రాజీనామా..
X

బీఆర్ఎస్కు మరో ఎమ్మెల్యే బిగ్ షాకిచ్చారు. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. శుక్రవారం రాజీనామాపై అధికారిక ప్రకటన చేస్తానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి ఇండిపెండెంట్గా పోటీచేస్తానని ప్రకటించారు. కాగా ఈసారి ఖానాపూర్ టికెట్ గులాబీ బాస్ జాన్సన్ నాయక్కు ఇవ్వడంతో రేఖా నాయక్ పార్టీపై గుర్రుగా ఉన్నారు.

అప్పటినుంచే రేఖానాయక్ పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. ఆమె కాంగ్రెస్లో చేరుతారని వార్తలొచ్చాయి. అయితే టికెట్పై హస్తం పార్టీ స్పష్టత ఇవ్వకపోవడంతో ఆమె చేరిక ఆగిపోయినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇండిపెండెంట్గా బరిలోకి దిగుతానని ప్రకటించారు. బీఆర్ఎస్ నుంచి టికెట్ రాకపోతే రెబల్ లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని గతంలోనే రేఖా నాయక్ చెప్పారు.

ఎస్టీ రిజర్వ్ స్థానమైన ఖానాపూర్ నియోజకవర్గానికి బీఆర్ఎస్ నేత అజ్మీరా రేఖా నాయక్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2009లో రాజకీయ అరంగేట్రం చేసిన ఆమె.. కాంగ్రెస్ తరఫున ఆసిఫాబాద్ జెడ్పీటీసీగా విజయం సాధించారు. 2013లో బీఆర్ఎస్లో చేరారు. 2014లో అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి రితేష్ రాథోడ్పై 30వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థి రమేష్ రాథోడ్పై 24,300 ఓట్ల మెజారిటీతో గెలిపొందారు.


Updated : 5 Oct 2023 10:02 AM GMT
Tags:    
Next Story
Share it
Top