Home > తెలంగాణ > Kishan Reddy: బీఆర్ఎస్, కాంగ్రెస్లది ఓటు బ్యాంకు రాజకీయం: కిషన్ రెడ్డి

Kishan Reddy: బీఆర్ఎస్, కాంగ్రెస్లది ఓటు బ్యాంకు రాజకీయం: కిషన్ రెడ్డి

Kishan Reddy: బీఆర్ఎస్, కాంగ్రెస్లది ఓటు బ్యాంకు రాజకీయం: కిషన్ రెడ్డి
X

హామీ ఇస్తే తప్పక అమలు చేసే సత్తా ఉన్న పార్టీ బీజేపీ.. దమ్ము, ధైర్యం కలిగిన నాయకులున్న పార్టీ బీజేపీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీసీలకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్, బీఆర్ఎస్ లదని విమర్శించారు. కేసీఆర్.. మొదటి ఐదేళ్ల పాలనలో తమ మంత్రివర్గంలో ఒక్క మహిళకు చోటివ్వలేదని మండిపడ్డారు. హైదరాబాద్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మాట్లాడిన కిషన్ రెడ్డి బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు. మొదటి నుంచి సామాజిక న్యాయం చేసిన పార్టీ బీజేపీ అని చెప్పుకొచ్చారు.

అబ్దుల్ కలాంను రాష్ట్రపతి చేసింది, ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను రాష్ట్రపతి చేసిన ఘనత తమ పార్టీకే దక్కుతుందని అన్నారు. ఎంఐఎంను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. మంత్రులు ఓల్డ్ సిటీకి వెళ్లి ప్రచారం చేయాలంటే.. అసదుద్దీన్ అనుమతి తీసుకుని పర్యటించాల్సిర దుస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని ఫైర్ అయ్యారు. మజ్లిస్ పార్టీ ప్రాభల్యం ఉన్న ఏరియాల్లో కరెంట్ బిల్లులు కట్టరు. ఆ పార్టీ రౌడీయిజాన్ని, గుండాయిజాన్ని పెంచి పోషిస్తుందని కిషన్ రెడ్డి ఆరోపించారు.

Updated : 29 Oct 2023 4:45 PM IST
Tags:    
Next Story
Share it
Top