Home > తెలంగాణ > ఆదిలాబాద్ టు పటాన్ చెరు.. ఇక రైలులో

ఆదిలాబాద్ టు పటాన్ చెరు.. ఇక రైలులో

ఆదిలాబాద్ టు పటాన్ చెరు.. ఇక రైలులో
X

తెలుగు రాష్ట్రాలకు రైల్వేశాఖ మరో గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల్లో కొత్త రైల్వే లైన్ ప్రతిపాధనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కొత్త రైల్వే లైన్ ప్రాజెక్ట్ వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ లకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించట్లేదని మండిపడ్డారు.





సాంక్షన్ అయిన కేంద్ర ప్రాజెక్ట్ ల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్కింగ్ కు భూమి అడిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదని అన్నారు. చర్లపల్లి కనెక్టివిటీ రోడ్ కు కూడా ప్రభుత్వం నుంచి చలనం లేదని అన్నారు. యాదాద్రి సహా పలు ఎంఎంటీఎస్ ప్రాజెక్ట్ కు సహకరించట్లేదని మండిపడ్డారు. త్వరలో సికింద్రాబాద్ - బెంగళూరు మధ్య రైల్వే లైన్ ప్రారంభిస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

కొత్త రైల్వేలైన్లు ఇవే..

* ఆదిలాబాద్‌ నుంచి పటాన్‌చెరు

* వరంగల్‌ నుంచి గద్వాల

* ఉందానగర్‌ నుంచి జగ్గయ్యపేట

* వికారాబాద్‌-కృష్ణా మధ్య కొత్త రైల్వేలైన్‌.

* ఆర్‌ఆర్‌ఆర్‌ చుట్టూ ఔటర్‌ రింగ్‌ రైల్వే ప్రాజెక్ట్‌




Updated : 3 Sept 2023 10:52 PM IST
Tags:    
Next Story
Share it
Top