Home > తెలంగాణ > తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై కిషన్ రెడ్డి క్లారిటీ..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై కిషన్ రెడ్డి క్లారిటీ..

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పుపై కిషన్ రెడ్డి క్లారిటీ..
X

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి మార్పుపై మరోసారి జోరుగా చర్చజరుగుతోంది. బండి సంజయ్ కు కేంద్రంలో కీలక పదవి ఇచ్చి.. రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డికి బాధ్యతలు ఇప్పగిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు ఇప్పట్లో ఉండదని క్లారిటీ ఇచ్చారు. బండి సంజయ్ యధావిధిగా అధ్యక్షుడిగా కొనసాగుతారని చెప్పారు.అధ్యక్షుడి మార్పుపై వస్తున్న వార్తలను ఊహాగానాలే అని కొట్టిపారేశారు.

పార్టీలో గందరగోళం సృష్టించడానికి ఇలాంటి వార్తలను పుట్టిస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు. అసలు బీజేపీ హైకమాండ్ దృష్టిలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి మార్పు ఆలోచనే లేదని స్పష్టం చేశారు. పార్టీలో ఒకరిద్దరు నాయకులు చేరనంత మాత్రాన ఎలాంటి నష్టం లేదని తెలిపారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో బీజేపీ అధ్యక్షుడి మార్పు ప్రచారానికి తెరపడింది. తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సైతం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి మార్పు ఉండదని బుధవారం తేల్చి చెప్పారు.

ఈటల, రాజగోపాల్ రెడ్డిలతో నడ్డా, అమిత్ షాల చర్చల తరువాత తెలంగాణ బీజేపీలో మార్పులపై వార్తలు వచ్చాయి. బండి సంజయ్‌ను తప్పించి కిషన్ రెడ్డి సారథ్యంలో కొత్త టీం ఏర్పాటు చేయనున్నట్లు పెద్ద ఎత్తున కథనాలు వెలువడ్డాయి. కానీ అవన్నీ అబద్ధపు ప్రచారాలని తేలిపోవడంతో ఈటల, రాజగోపాల్ రెడ్డి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌‌కు ఈటలకు మధ్య కోల్డ్ వార్ నడుస్తున్నట్లు టాక్ వినిపిస్తున్న సంగతి తెలిసిందే..

Updated : 28 Jun 2023 7:26 PM IST
Tags:    
Next Story
Share it
Top