బీజేపీ ఏ పార్టీతో పొత్తుపెట్టుకోదు.. సింగిల్గానే పోటీ చేస్తుంది
X
మరో నాలుగైదు నెలల్లో జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీ పొత్తులపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం నిర్వహించిన మీడియాతో సమావేశంలో మాట్లాడిన ఆయన.. పార్లమెంట్ ఎలక్షన్స్ లో బీజేపీకి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు. ఏ సర్వేలకు అందని విధంగా లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే.
పొత్తులో భాగంగా బీజేపీ.. జనసేన పార్టీకి 8 టికెట్లను కేటాయించిన విషయం తెలిసిందే. కాగా 8 చోట్ల జనసేన డిపాజిట్లు కోల్పోయింది. పవన్ కళ్యాణ్ ఇమేజ్.. బీజేపీకి కలిసొస్తుంది అనుకుని వ్యూహం పన్నితే అది కాస్త బెడిసికొట్టింది. జనసేనతో పొత్తు లాభం కంటే బీజేపీకి ఎక్కువ నష్టం చేకూర్చిందని రాజకీయ విశ్లేషకులు అన్నారు. బీజేపీ పోటీ చేసినా.. ఎక్కువ ఓట్లు వచ్చేవని చెప్తున్నారు. దీంతో బీజేపీ ముందే అప్రమత్తం అయింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే ఈ నెల చివర్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పర్యటిస్తారని తెలిపారు.