Home > తెలంగాణ > సిట్టింగ్ సీఎంను.. కాబోయే సీఎంను ఓడించిన ఘనత బీజేపీది

సిట్టింగ్ సీఎంను.. కాబోయే సీఎంను ఓడించిన ఘనత బీజేపీది

సిట్టింగ్ సీఎంను.. కాబోయే సీఎంను ఓడించిన ఘనత బీజేపీది
X

రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పడిపోయింది అనుకున్న టైంలో.. అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచింది. గతంలో సాధారణ ఎన్నికల్లో కేవలం ఒక స్థానానికే పరిమితమైన బీజేపీ.. ఎవరూ ఊహించనట్లుగా ఈసారి 8 స్థానాల్లో విజయం సాధించింది. కాకపోతే కీలక నేతలు.. బండి సంజయ్, ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు లాంటి వాళ్లు ఓడిపోవడం ఆ పార్టీకి కాస్త జీర్ణించుకోలేని విషయమే. ఈ క్రమంలో మీడియాతో మాట్లాడిన ఆ పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీనుద్దేశించి మాట్లాడారు. రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు సాధించేందుకు కృషి చేయబోతున్నట్లు చెప్పారు. నిరాశ, నిస్పృహలకు లోను కాకుండా ముందుకు వెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు బీజేపీ కార్యకర్తలను డబ్బు మద్యానికి ఆశపెట్టినా లొంగకుండా పార్టీకోసం పనిచేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో బీజేపీకి వచ్చిన భారీ మెజారిటీ.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రాలేదని అన్నారు.

ఒక సిట్టింగ్ సీఎంను.. కాబోయే సీఎంను ఓడించిన ఘనత బీజేపీదేనని కిషన్ రెడ్డి తెలిపారు. తమ అభ్యర్థి వెంకటరమణారెడ్డి కామారెడ్డిలో రేవంత్ రెడ్డి, కేసీఆర్ లను ఓడిచడంతో బీజేపీ సత్తా బయటపడిందని చెప్పారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం సాధించి నరేంద్ర మోదీ హ్యాట్రిక్ సీఎం అవుతారని అన్నారు. తెలంగాణ ప్రజలు కూడా తమవెంటే ఉన్నారని, ప్రచారానికి వెళ్లినప్పుడు మోదీనే ప్రధాని చేస్తామని హామీ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఓటర్లు సైతం లోక్ సభ ఎన్నికల్లో మాకు ఓటు వేస్తామని చెప్పారు అని కిషన్ రెడ్డి వెల్లడించారు.

Updated : 4 Dec 2023 11:09 AM GMT
Tags:    
Next Story
Share it
Top