Kishan Reddy : బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే మునిగిపోయినట్లే.. కిషన్ రెడ్డి కామెంట్స్
X
లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లను బీజేపీ గెలుస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. విజయ సంకల్పయాత్రలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గం రాంనగర్ చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహించారు. సభలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే మునిగిపోయినట్లేనని అన్నారు. మరి కొన్ని నెలల్లో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల్లో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. తెలంగాణలో ఉన్న మొత్తం 17 పార్లమెంట్ స్థానాల్లో కాషాయ జెండా ఎగరవేస్తామని అన్నారు. దీనిపై కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు.
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓట్ల శాతం పెరిగిందని పేర్కొన్నారు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ పార్టే గెలవాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ 370కిపైగా స్థానాలు గెలుపొంది.. మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయం. కేసీఆర్ కుటుంబం రూ.లక్షల కోట్లు దోచుకుందనే ఉద్దేశంతో ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారు. కానీ ప్రస్తుతం ఆ పార్టీ నాయకులు కూడా అవినీతికి పాల్పడుతున్నారు. ఎన్నికల నేపథ్యంలో బిల్డర్లు, వ్యాపారవేత్తలను బెదిరిస్తున్నారు. దేశ భవిష్యత్తు కోసం ప్రజలు బీజేపీకి ఓటు వేయాలి’ అని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు శ్యామ్‌సుందర్‌గౌడ్, ముషీరాబాద్ నియోజకవర్గ బిజేపీ కార్యకర్తలు పాల్గోన్నారు.