Home > తెలంగాణ > సీఎం రేవంత్‌తో కేకే భేటీ..హస్తం పార్టీలోకి చేరికపై చర్చ

సీఎం రేవంత్‌తో కేకే భేటీ..హస్తం పార్టీలోకి చేరికపై చర్చ

సీఎం రేవంత్‌తో కేకే భేటీ..హస్తం పార్టీలోకి చేరికపై చర్చ
X

ముఖ్యమంత్రితో ఎంపీ కేశవరావు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ సీఎం నివాసంలో కేకే కలిశారు. ఈ సందర్భంగా పార్టీలో జాయినింగ్‌పై రేవంత్‌రెడ్డి తో కేశవరావు చర్చించారు. ఇది ఇలా ఉండగా, ఇక అంతకు ముందు…పార్టీ మార్పు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీపై సీనియర్ నేత కె.కేశవరావు స్పందించారు. కేసీఆర్ నాకు చాలా గౌరవం ఇచ్చారు. నాకు కూడా కేసీఆర్‌పై గౌరవం ఉంది అని అయినా కాంగ్రెస్లోకి వెళ్లాలనే నిర్ణయించుకున్నా అని వెల్లడించారు. అదే విషయం కేసీఆర్‌కు చెప్పా అని అన్నారు. కవిత అరెస్టుపై కూడా చర్చించామని ఆయన వివరించారు. కేకే రేపు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.

మరోవైపు మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సైతం బీఆర్‌ఎస్‌ను వీడనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 30న బీఆర్‌ఎస్ ఎంపీ కేకేతో పాటు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే గడ్డం అరవింద్‌రెడ్డి సైతం కాంగ్రెస్‌లో చేరనున్నట్లు సమాచారం. మరోవైపు స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కాంగ్రెస్‌ లో చేరనున్నారు. తన కూతురు కావ్య సహా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. వరంగల్ పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఇద్దరిలో ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్‌లో కడియం చేరికతో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. కడియం శ్రీహరి బీఆర్ఎస్‌ను వీడటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో గులాబీ పార్టీకి గట్టి దెబ్బే తగిలే అవకాశం ఉంది

Updated : 29 March 2024 9:43 AM GMT
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top