Home > తెలంగాణ > నల్లగొండ అసెంబ్లీ టికెట్కు కోమటిరెడ్డి దరఖాస్తు

నల్లగొండ అసెంబ్లీ టికెట్కు కోమటిరెడ్డి దరఖాస్తు

నల్లగొండ అసెంబ్లీ టికెట్కు కోమటిరెడ్డి దరఖాస్తు
X

తెలంగాణ కాంగ్రెస్లో టికెట్ల సందడి నెలకొంది. ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశావాహులు దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఎంత పెద్ద నేతలైనా దరఖాస్తు చేసుకోవాల్సిందేనని పార్టీ స్పష్టం చేసింది. దీంతో నేతలంగా గాంధీ భవన్కు క్యూ కట్టారు. ఈ క్రమంలో ఆ పార్టీ ఎంపీ, సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ అసెంబ్లీ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయన తరుపున నల్గొండకు చెందిన పలువురు కాంగ్రెస్ నేతలు గాంధీ భవన్లో దరఖాస్తు అందజేశారు.

2018 అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ నుంచి కోమటిరెడ్డి బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి విజయం సాధించారు. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి నుంచి పోటీ చేసి గెలిచారు. కాగా 1999లో అసెంబ్లీలో కోమటిరెడ్డి తొలిసారి అడుగుపెట్టారు. 1999లో నల్గొండ నుంచి పోటీ చేసిన ఆయన సీపీఎం అభ్యర్ధి నంద్యాల నర్సింహారెడ్డిపై విజయం సాధించారు. ఆ తర్వాత 2004, 2009, 2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి పోటీ చేసి గెలిపొందారు.

కాగా తెలంగాణలో మరో మూడు నెలల్లొ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పొలిటకల్ హీట్ ఒక్కసారిగా పెరిగింది. సీఎం కేసీఆర్ ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు. ఈ క్రమంలో అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. దరఖాస్తులను ముందుగా కాంగ్రెస్ ఎన్నికల కమిటీ పరిశీలిస్తుంది. ఆ తర్వాత స్క్రీనింగ్ కమిటీ పరిశీలించి.. హైకమాండ్కు పంపిస్తుంది. అనంతరం హైకమాండ్ అభ్యర్థులను ఫైనల్ చేయనుంది.



Updated : 23 Aug 2023 11:37 AM GMT
Tags:    
Next Story
Share it
Top