Home > తెలంగాణ > 24 గంటల కరెంట్ ఎక్కడిస్తున్నరో చూపిస్తే జీవితాంతం బీఆర్ఎస్కు సేవ చేస్తా

24 గంటల కరెంట్ ఎక్కడిస్తున్నరో చూపిస్తే జీవితాంతం బీఆర్ఎస్కు సేవ చేస్తా

24 గంటల కరెంట్ ఎక్కడిస్తున్నరో చూపిస్తే జీవితాంతం బీఆర్ఎస్కు సేవ చేస్తా
X

మంత్రి కేటీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. రైతులకు రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఎక్కడిస్తున్నారో చూపెట్టాలని డిమాండ్ చేశారు. అందరం కలిసి బీఆర్ఎస్ పట్టున్న నల్గొండ, సిరిసిల్లలో సబ్ స్టేషన్లకు వెళ్లి చూద్దామన్నారు. ఒకవేళ రాష్ట్రంలో రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చినట్టు చూపిస్తే.. తన ఎంపీ పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమన్నారు. రైతులకు కనీసం 10 గంటల కరెంట్ కూడా ఇవ్వట్లేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే.. ఫ్రీగా 24గంటల త్రీ ఫేజ్ కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన కోమటి రెడ్డి.. నాణ్యమైన విద్యుత్ ఇస్తే సబ్ స్టేషన్ల దగ్గర రైతులు ఆందోళన ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ హామీల వల్ల ఏ రైతు లాభపడ్డాడో చూపిస్తే.. జీవితాంతం బీఆర్ఎస్ పార్టీకి సేవ చేస్తానని చెప్పుకొచ్చారు. మూడు గంటలు కావాలా.. మూడు పంటల కావాలంటున్న కేటీఆర్ ను చెప్పుతో కొట్టాలంటూ కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కొక్క ఎమ్మెల్యే వెయ్యి కోట్లు తిని.. అది అరకగ ధర్నాలు చేస్తున్నారంటూ కవితపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Updated : 12 July 2023 5:18 PM IST
Tags:    
Next Story
Share it
Top