Home > తెలంగాణ > కేసీఆర్ను పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కేసీఆర్ను పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కేసీఆర్ను పరామర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
X

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ను.. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరామర్శించారు. ఇవాళ (డిసెంబర్ 10) సోమాజీగూడ యశోద హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కేసీఆర్ ను కలిసి.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తర్వాత కేటీఆర్, ఎమ్మెల్సీ కవితతో మాట్లాడి ధైర్యం చెప్పారు. కేసీఆర్‌ను పరామర్శించిన వారిలోకాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు వీ హనుమంతరావు, కోదండరామిరెడ్డి ఉన్నారు. కేసీఆర్‌ను పరామర్శించిన వారిలోకాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు వీ హనుమంతరావు, కోదండరామిరెడ్డి ఉన్నారు.

అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన కోమటిరెడ్డి.. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ పాత్ర మరువలేనిదన్నారు. కేసీఆర్ కు గాయం కావడం బాధాకరమని.. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రర్థిస్తున్నట్లు తెలిపారు. కాగా తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్స అనంతరం కేసీఆర్‌ కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. శస్త్ర చికిత్స అనంతరం ఫిజియోల పర్యవేక్షణలో కేసీఆర్ వాకర్‌ సాయంతో నడిచారు. గాయం నుంచి కోలుకోవడానికి ఏడెనిమిది వారాల్లో కోలుకుంటారని డాక్టర్లు తెలిపారు.

Updated : 10 Dec 2023 9:05 PM IST
Tags:    
Next Story
Share it
Top