Home > తెలంగాణ > సీఎల్పీ కార్యాలయాలు కూల్చి.. కొత్త భవనాలు నిర్మిస్తాం

సీఎల్పీ కార్యాలయాలు కూల్చి.. కొత్త భవనాలు నిర్మిస్తాం

సీఎల్పీ కార్యాలయాలు కూల్చి.. కొత్త భవనాలు నిర్మిస్తాం
X

రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎల్పీ కార్యాలయాలు కూల్చి కొత్త భవనాలు నిర్మిస్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కొత్త కౌన్సిల్ భవన నిర్మాణానికి ఆదేశించారని స్పష్టం చేశారు. త్వరలో కొత్త కౌన్సిల్‌ భవన నిర్మాణం చేపడతామని, పాత భవనం ఆవరణలోనే ఏర్పాటు చేస్తామని చెప్పారు. సచివాలయంలోని 5వ అంతస్తులోని తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత.. కోమటిరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన 9 ముఖ్య ఫైల్స్‌పై సంతకాలు చేశారు. వీటిలో నల్గొండ నుంచి ధర్మాపురం, ముషంపల్లి రహదారిని 4 లైన్ లుగా చేయడం, కొడంగల్, దుడ్యాల రహదారి విస్తీర్ణానికి సంబంధించిన ఫైల్స్ ఉన్నాయి. రానున్న రెండు లేదా మూడేళ్లలో రహదారుల విస్తీర్ణానికి చర్యలు తీసుకుంటామని కోమటిరెడ్డి తెలిపారు. గతంలోనూ ఆయనకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది.

కోమటిరెడ్డి 1999, 2004, 2009, 2014లలో నల్గొండ నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. 2018లో మళ్లీ నల్గొండ నుంచే పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. అయితే 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో భువనగిరి ఎంపీగా గెలిపొందారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో నల్గొండ ఎమ్మెల్యేగా ఎన్నికైన కోమటిరెడ్డి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Updated : 10 Dec 2023 3:48 PM IST
Tags:    
Next Story
Share it
Top