Home > తెలంగాణ > Komatireddy Venkat Reddy : కేసీఆర్కు.. రేవంత్ సర్కార్కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది: కోమటిరెడ్డి

Komatireddy Venkat Reddy : కేసీఆర్కు.. రేవంత్ సర్కార్కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది: కోమటిరెడ్డి

Komatireddy Venkat Reddy : కేసీఆర్కు.. రేవంత్ సర్కార్కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది: కోమటిరెడ్డి
X

బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు మంగళవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ అయ్యారు. దీనిపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. కేసీఆన్ కు దిక్కులేక ప్రవీణ్ కుమార్ కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిని ఎదుర్కొనలేకే బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వానికి.. రేవంత్ సర్కార్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత హరీశ్ రావు బీఆర్ఎస్ లో ఉండటం డౌటేనని.. బీజేపీలో చేరతారని జోస్యం చెప్పారు. హరీశ్ రావు ఇప్పటికే బీజేపీతో సంప్రదింపులు జరిపారని చెప్పారు.

బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ సర్వ నాశనం అయిందన్నారు. వేల కోట్ల రూపాయల అప్పుల పాలు చేసి రాష్ట్రాన్ని వందేళ్లు వెనక్కి నెట్టారని ఆరోపించారు. కేసీఆర్ కు రేవంత్ రెడ్డిని ఎదుర్కునే దమ్ము లేకే అసెంబ్లీకి రావడం లేదని అన్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిందని, ఇక ఆ పార్టీలో మిగిలేదని నలుగురేనని విమర్శించారు. రాహుల్ గాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే.. మోదీ కంటే ఎక్కువ మెజారిటీ వస్తుందని ధీమీ వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో 14 ఓట్లు గెలుస్తామని చెప్పారు. ఎల్ఆర్ఎస్ గైడ్ లైన్స్ ఇంకా పూర్తి కాలేదన్న కోమటిరెడ్డి.. దీన్ని బీఆర్ఎస్ అనవసరంగా రాద్ధాంతం చేస్తుందన్నారు.




Updated : 6 March 2024 7:30 AM GMT
Tags:    
Next Story
Share it
Top