Home > తెలంగాణ > జగదీశ్ రెడ్డికి కోట్ల విలువైన బంగ్లాలు ఎట్లొచ్చినయ్ - రాజగోపాల్ రెడ్డి

జగదీశ్ రెడ్డికి కోట్ల విలువైన బంగ్లాలు ఎట్లొచ్చినయ్ - రాజగోపాల్ రెడ్డి

జగదీశ్ రెడ్డికి కోట్ల విలువైన బంగ్లాలు ఎట్లొచ్చినయ్ - రాజగోపాల్ రెడ్డి
X

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావడం ఖాయమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆ పార్టీ సభ్యులను బ్రహ్మ దేవుడు కూడా కాపాడలేరని అన్నారు. అభివృద్ధి పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని రాజగోపాల్ ఆరోపించారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి కోట్ల విలువైన బంగ్లాలు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

బీఆర్ఎస్ సభ్యులు ప్రతిసారి పార్టీ మార్పుపై విమర్శలు చేయడంపై రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ప్రజల కోసమే పార్టీ మారానని, పార్టీకి రాజీనామా చేసిన తర్వాతే మరో పార్టీలో చేరానని చెప్పారు. పార్టీలు మారానంటూ అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఫైర్ అయ్యారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించుకుండానే బీఆర్ఎస్లో చేర్చుకున్న ఘనత వారి సొంతమని రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.




Updated : 21 Dec 2023 3:04 PM IST
Tags:    
Next Story
Share it
Top