Home > తెలంగాణ > కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి బీజేపీ కీలక పదవి

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి బీజేపీ కీలక పదవి

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి బీజేపీ కీలక పదవి
X

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ భారీ మార్పులు చేస్తోంది. ఇప్పటికే పార్టీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని, ఎన్నికల కమిటీ చైర్మన్గా ఈటల రాజేందర్ను నియమించింది. ఈ క్రమంలో మరో నేతకు కీలక పదవిని కట్టబెట్టింది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

రాజగోపాల్‌రెడ్డి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్‌ స్పష్టం చేశారు.

రాజగోపాల్ రెడ్డి గత కొంత కాలంగా పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఆయన తిరిగి కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలోనే ఆయనతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుతో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీ.. కోమటిరెడ్డి కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారానికి మరింత బలం చేకూర్చింది. ఈ సమయంలోనే బీజేపీ అధిష్టానం ఆయనను జాతీయ కార్యవర్గ సభ్యులుగా నియమించడం గమనార్హం.

మరోవైపు బండి సంజయ్ కు కేంద్ర సహాయ మంత్రి పదవి ఇస్తారనే వార్తలొస్తున్నాయి. సంజయ్ హయాంలో పార్టీ గ్రాఫ్ బాగా పెరిగిందనే భావనలో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు సముచిత స్థానం కల్పించే యోచనలో ఉన్నట్లు సమాచారం. పార్టీ అధ్యక్షుడిగా ఎంపికైన కిషన్ రెడ్డిని కేంద్రమంత్రి పదవి నుంచి తప్పించి.. బండి సంజయ్ను మంత్రి వర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతోంది.





Updated : 5 July 2023 7:45 PM IST
Tags:    
Next Story
Share it
Top